నెట్ లో చిక్కుకున్న కొండచిలువ

80చూసినవారు
విశాఖ తూర్పు నియోజకవర్గం లోని ఆరిలోవలో బుధవారం కొండచిలువ హల్చల్ చేసింది. ఆరిలోవలోని హర్ష టవర్స్ లోని ప్లే గ్రౌండ్ లో వున్న నెట్ లో కొండచిలువ ఇరుక్కుపోయింది. అపార్ట్మెంట్ వాసులు బ్యాడ్మింటన్ ఆడుతుండగా దీన్ని గమనించారు. వెంటనే స్నేక్ క్యాచర్ కిరణ్ కు ఫోన్లో విషయం తెలియజేయగా. ఆయన అక్కడ చేరుకొని పైతాన్ ను చాకచక్యంగా పట్టుకుని సమీప అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

సంబంధిత పోస్ట్