నేడు అక్క‌డ‌క్క‌డా వ‌ర్షాలు

64చూసినవారు
నేడు అక్క‌డ‌క్క‌డా వ‌ర్షాలు
నైరుతీ రుతుప‌వ‌నాలు చురుగ్గా క‌దులుతున్నాయి. ఈనేప‌థ్యంలో మంగ‌ళవారం రాష్ట్రంలో పలు చోట్ల వ‌ర్షాలు కుర‌వ‌నున్నాయ‌ని విశాఖ‌లోని వాతావ‌ర‌ణ కేంద్రం సోమ‌వారం రాత్రి ప్ర‌త్యేక బులిటెన్‌లో వివ‌రించింది. రాయ‌ల‌సీమ‌లో ఓ మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉంది. అలాగే అల్లూరి జిల్లా, కృష్ణ‌, గుంటూరు, ఉత్త‌రాంధ్ర‌, తిరుప‌తి త‌దిత‌ర జిల్లాలో వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉందని తెలిపింది.

సంబంధిత పోస్ట్