ఏడాది కాలంగా భర్తతో విభేదాలు వల్ల దూరంగా ఉంటున్న లక్ష్మీ ప్రసన్న, మానసిక ఆందోళనకు గురైనట్టు తెలుస్తోంది. బాధను తట్టుకోలేక రెండేళ్ల కుమారుడిని తల్లి వద్ద ఉంచి, బుధవారం తాను నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసిన కంచరపాలెం పోలీసులు, భర్తతో పాటు కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. పూర్తి వివరాలు సేకరించి దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు.