ఎస్సీల వర్గీకరణను తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతామోహన్ స్పష్టం చేశారు. శుక్రవారం విశాఖప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ఏపీలో వర్గీకరణ పై ఏకసభ్య కమిషన్ వేయడం తప్పన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీలు కన్నీటితో ఉన్నారు. విశాఖ నుంచే రోడ్లపైకి ఎస్సీలు రాబోతున్నారన్నారు. శనివారం వైజాగ్ వస్తున్న చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ పై స్పందించాలని డిమాండ్ చేశారు.