జీవీఎంసీ 85 వ వార్డు అగనంపూడి పునరావాస కాలనీ కొండయ్యవలస గ్రామంలో సోమవారం అర్ధరాత్రి భారీ దొంగతనం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బాధితుడు ముడిదాన రాజు స్థానికముగా వెల్డింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించు కుంటున్నారు. అనంపూడి జాతీయ రహదారికి కూసవేటు దూరంలో గల ఒక భవన సముదాయంలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. వేసవి కాలం కావడం తో సోమవారం రాత్రి తన ఇంటి మేడపై నిదురించాడు. మరుసటి రోజు ఉదయం కిందకి వచ్చి చూడగా తన ఇంటి తాళం తీసి ఉండడం చూసి అనుమానముతో లోనికి వెళ్లి చూడగా ఇంట్లో వస్తువులు అన్నీ చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. బీరువా లో చూడగా తన భార్య యొక్క బంగారపు పుస్తెల తాడు, మరియు తాను భద్ర పరచిన నగదు, వెండి వస్తువులు మరియు అతని బైక్ చోరీకి గురయ్యయని గమనించి నిర్గాంత పోయాడు. స్థానిక గ్రామ పెద్దలు బాధితునికి దైర్యం చెప్పి దువ్వాడ పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఫిర్యాదు చేసారు.