విశాఖ ఉక్కు ఉత్పత్తులపై అకుంఠిత దీక్షతో పనిచేస్తున్న ఉక్కు కార్మికులపై తక్షణం యాజమాన్యం తన వైఖరిని మార్చుకోవాలని స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు అయోధ్యరామ్ డిమాండ్ చేశారు. శనివారం ప్లాంట్లో ఆఫీస్ బేరర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అయోధ్యరామ్ మాట్లాడుతూ ప్రభుత్వ యాజమాన్యాలు ఉత్పత్తికి అనుకూల పరిస్థితులను కల్పిస్తే ఉక్కు కార్మికులు తమ అనుభవాన్ని రంగరించి అద్భుత ఫలితాలు సాధిస్తారని నేడు నిరూపితమైందన్నారు.