లోయలో పడ్డ వాహనం

60చూసినవారు
లోయలో పడ్డ వాహనం
అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ళ పంచాయితీలో.. లోయలపాలెం గ్రామానికి నవనిర్మాణ సమితి ఆధ్వర్యంలో వాటర్ పైపులు తీసుకు వెళ్తున్న బొలొరో వాహనం బోల్తా పడింది. చింతామణి పాలెం బాలరేవులు మధ్య ఘాట్ రోడ్ లో వాహనానికి బ్రేకులు ఫెయిల్యూర్ అవ్వడంతో వాహనం అదుపుతప్పి లోయలోకి వెళ్లిపోయిందని స్థానికులు తెలిపారు. డ్రైవరు క్షేమంగానే బయటపడ్డాడని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

సంబంధిత పోస్ట్