మాడుగుల మండలంలో మేలుకొలుపు కార్యక్రమాలు సోమవారంతో ముగిశాయి. గత నెల రోజులుగా ధనుర్మాసం ప్రారంభం నుంచి తెల్లవారుజామున పురవీధులలో దైవ నామస్మరణ చేస్తూ ముక్కోటి దేవతలను స్మరిస్తూ వారిని మేలుకొలుపుతూ భక్తి పాటలు ఆలపించేవారు. మాడుగుల సీతారామ ఆలయ భక్తబృందం ఆధ్వర్యంలో, పి బలరాం, జి శ్రీను తదితరులు ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. చిన్నారులు మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.