అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం జల్లూరు గ్రామంలో మదర్ తెరిసా 114వ జన్మదిన వేడుకలను మదర్ హెల్ప్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ఘనముగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మదర్ హెల్ప్ సేవాసమితి అధ్యక్షులు గోపినాధ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మదర్ తెరిసాని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు విద్యార్థి దశ నుండే సేవ గుణాన్ని అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.