నర్సీపట్నంలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్

74చూసినవారు
నర్సీపట్నంలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్
నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు, జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు శనివారం నర్సీపట్నం టౌన్ పరిధిలో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. సత్ప్రవర్తన కలిగి ఉండాలని, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండాలని సూచించారు. నేరాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్పడటం వల్ల శాంతి భద్రతలకు హాని కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం టౌన్ సీఐ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్