మీరు ఏ పార్టీకి చెందిన వారయిన నేను మనసులో పెట్టుకోను. మీకేం కావాలో అందరూ కలిసి చెప్పండి. వెంటనే మంజూరు చేస్తానని ఏపీ సభాపతి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆయన ఆదివారం నాతవరం మండలం చెర్లోపాలెం గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 100 రోజుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలని లక్ష్యంతో ఈ కార్యక్రమమన్నారు.