గొలుగొండ మండలం చోద్యం గ్రామ శివారు బొడ్డేరు గెడ్డ ప్రాంతంలో సారా తయారీ స్థావరాలపై కృష్ణదేవిపేట పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సారా తయారీకి సిద్ధం చేసిన 300 లీటర్ల బెల్లం పులుపును ధ్వంసం చేసినట్లు ఎస్సై తారకేశ్వర రావు తెలిపారు. నాటు సారా తయారు చేసినా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.