టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడుపై పోసాని కృష్ణ మురళి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ అనకాపల్లి పార్లమెంటరీ సెక్రటరీ మరిడయ్య నర్సీపట్నం పట్టణ పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయనమా ట్లాడుతూ.. టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడుపై పోసాని కృష్ణ మురళి చేసిన అనుచిత వ్యాఖ్యలు పూర్తిగా కుట్రపూరితమైనవని, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.