నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై పి. రాజారావు, సిబ్బంది ధర్మాసాగరం గ్రామ శివారులో నాటు సారా తయారీ కేంద్రాలపై గురువారం దాడులు చేశారు. నాటు సారా తయారీకి ఉపయోగించే పులుపు సుమారు 3000 లీటర్ల ను ధ్వంసం చేశారు. ఎక్కడైనా నాటుసార తయారీ గాని అమ్మకాలుగాని అక్రమంగా మద్యం అమ్మకాలు జరిగినట్లుగా అయితే వెంటనే సంబంధిత సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాలని కోరారు. నాటు సారా నేరస్తులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.