వైసీపీ ఐదేళ్ల కాలంలో నర్సీపట్నంలో ఒక్క డ్రైనేజీ కూడా నిర్మించడం చేతకాలేదని జనసేన పార్టీ నర్సీపట్నం టౌన్ అధ్యక్షుడు అద్దేపల్లి గణేశ్ ఆరోపించారు. ఆదివారం నర్సీపట్నంలో ఆయన మాట్లాడుతూ తాము ఒక్క డ్రైనేజీ కూడా కట్టలేదని మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేశ్ ఒప్పుకున్నారని చెప్పారు. మున్సిపాలిటీలో మూడున్నరేళ్ల కాలంలో మూడు ట్రాక్టర్లను అద్దెకు తెచ్చి కోటిన్నర రూపాయలు మున్సిపాలిటీ ప్రజల సొమ్ము వృధా చేశారన్నారు.