రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు మంగళవారం ప్రకటించారు. సెప్టెంబర్ 4న జరిగే తన జన్మదిన వేడుకలను ఎవరు నిర్వహించవద్దని అభిమానులు పార్టీ శ్రేణులకు అయిన విజ్ఞప్తి చేశారు. వరదల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పుట్టినరోజు వేడుకలకు నిర్వహించే ఖర్చును వరద బాధితులకు అందించాలని విజ్ఞప్తి చేశారు.