విశాఖలో వాల్తేరు డివిజన్లో ఘనంగా గాంధీ జయంతిని బుధవారం నిర్వహించారు. విశాఖ రైల్వే స్టేషన్ పరిధిలోని స్వచ్ఛతా సేవా హి కార్యక్రమాన్ని డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్ నిర్వహించారు. స్వయంగా పరిసరాలను శుభ్రం చేశారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పారిశుద్ధ్య కార్మికులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.