విశాఖ ఉత్తర నియోజకవర్గం బీజేపీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో పలువురు వివిధ సమస్యలపై ఆయనను కలిసి వినతి పత్రాలు అందజేశారు. పలు సమస్యలను ఆయన అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని అన్నారు.