రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తున్న నామినేటెడ్ పదవుల్లో కవులు, కళాకారులు, రచయితలకు స్థానం కల్పించాలని ప్రజా గాయకుడు మజ్జి దేవిశ్రీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. ఇప్పటి వరకు భర్తీ చేసిన నామినేటెడ్ పదవుల్లో వీరికి ఎక్కడా స్థానం కల్పించలేదని అన్నారు. బుధవారం ఎంవిపి కాలనీలో మాట్లాడుతూ.. మీకు భజన చేసిన వారు తప్పితే.. మేధావులు, కవులు, కళాకారులు, రచయితలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.