జీవీఎంసీ కార్పొరేటర్ల అధ్యయన యాత్రకు ఆర్థికపరమైన అనుమతి ఉందా అని విశాఖ జీవీఎంసీ కార్పొరేటర్ జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్ మంగళవారం ప్రశ్నించారు. అనుమతి ఉంటే ఖర్చును ఏ విధంగా అంచనా వేశారో తెలపాలని పేర్కొన్నారు. అలాగే అనుమతించిన అధికారి ఎవరని ప్రశ్నించారు. ప్రజల కట్టే పన్నుల నుంచి ఎటువంటి ప్రయోజనం లేని యాత్రకు నిధులు ఖర్చు చేయడం సమంజసంగా లేదన్నారు.