విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్తో కోస్టల్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బర్రి కొండబాబు శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు ఫిషింగ్ హార్బర్ సమస్యలు, మత్స్యకారుల సంక్షేమం, ఆయిల్ సబ్సిడీ వంటి విషయాలు చర్చించారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న మత్స్యకార వ్యతిరేక విధానాలపై పోరాడాలని వాసుపల్లి పేర్కొన్నారు.