తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో విశాఖ జిల్లా కంచరపాలేనికి చెందిన శాంతి మృతి చెందిన విషయం తెల్సిందే. శుక్రవారం ఆమె మృతదేహం విశాఖలోని స్వగృహానికి చేరుకుంది. సమాచారం తెలుసుకున్న విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. జరిగిన ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసానిచ్చారు.