బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విశాఖపట్నం జిల్లాలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. శుక్రవారం విశాఖ సాగర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. అలల ఉధృతి కారణంగా నోవాటెల్ హోటల్ ఎదుట ఉన్న సాగర తీరం కోతకు గురైంది. దీంతో తీరానికి ఆనుకొని ఉన్న పలు నిర్మాణాలు నేలమట్టమయ్యాయి.