రెవెన్యూ సేవలను మరింత విస్తృతం చేయాలని, అధికారులు, సిబ్బంది ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం విశాఖలో జరిగిన డివిజన్ రెవెన్యూ కాన్ఫరెన్స్లో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పని చేయాలని, ప్రజలకు సత్వరమే సేవలను అందించాలని సూచించారు. నిర్ణీత సమయంలోగా సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు.