అల్లూరి జిల్లా చింతపల్లిలో బురద రోడ్డులో డోలీ మోతతో నిండు గర్భిణీ లక్ష్మీని ఆసుపత్రికి తరలించారు. పాడేరు ప్రాంతంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుడిని డోలి కట్టి వాగు ప్రవాహం దాటించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఘటనలెన్నో పునరావృతమవుతూనే ఉన్నాయి. ఈ మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించి, డోలీ మోతల కష్టాలు తీర్చాలని గిరిజనులు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ని సామాజిక మాధ్యమం ఎక్స్ లో ట్యాగ్ చేసి వేడుకున్నారు.