అసంఘటిత కార్మికులు ఇ-శ్రమ్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలని ఎంపీడీవో శ్రీనివాసరావు తెలిపారు. శనివారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుంచి ఆయన మాట్లాడుతూ. అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇ-శ్రమ్ పోర్టల్ అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. వివిధ శాఖలో పనిచేస్తున్న కార్మికులు ఇ-శ్రమ్ లో నమోదు చేసి, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.