హుకుంపేట: కిల్కారి మొబైల్ సేవలపై అవగాహన

84చూసినవారు
అన్నయ్య వదినమ్మ నమస్కారం బాగున్నారా అని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కిల్కారి మొబైల్ సేవలపై హుకుంపేట మండలంలోని గూడలో ఆశా కార్యకర్త పుష్ప బాలింతలకు గర్భిణీలకు మంగళవారం అవగాహన కల్పించారు. బిడ్డ పుట్టిన గంటలోపే బిడ్డకు పాలు తాగించాలని కోరారు. తల్లిపాలే బిడ్డకు సంపూర్ణ ఆహారమని బిడ్డకు కావాల్సినవన్నీ వాటిలో ఉంటాయన్నారు. మాత శిశు మరణాల నిరోధ చర్యల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్