సమస్యల పరిష్కారం కోరుతూ గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు చేస్తున్న నిరసన దీక్ష శుక్రవారం 14వ రోజు కొనసాగింది. దీంతో గురుకులాల్లో విద్య కుంటుపడుతుంది. పాడేరు డివిజన్ 11 మండలాలకు చెందిన గురుకుల పాఠశాలలు, కళాశాలలలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు అధ్యాపకులు జిల్లా కేంద్రం పాడేరు ఐటిడిఏ ఎదురుగా 14 రోజులుగా రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. అధికారులు స్పందించకపోవడం విచారకరమంటున్నారు.