పాడేరు: సీసీ రోడ్డు మంజూరుతో గిరిజనులు హర్షం

68చూసినవారు
పాడేరు: సీసీ రోడ్డు మంజూరుతో గిరిజనులు హర్షం
పాడేరు మండలంలోని అయినాడ పంచాయతీ పరిధి వంట్లమామిడి గ్రామానికి సీసీ రోడ్డుమంజూరుతో గిరిజనులు శనివారం హర్షం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా గదబవలస నుండి వంట్లమామిడి వరకు రూ.30 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టనుండడంతో వంట్లమామిడి గిరిజనులకు డోలుమోత కష్టాలు తప్పిందని సంతోషం వ్యక్తం చేశారు. సీసీ రోడ్డు మంజూరు చేయించిన అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్