అల్లూరి జిల్లా జీ. మాడుగుల మండలం పెద్దలోచలి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త లోచలి బొంజునాయుడు అనారోగ్యంతో సోమవారం మధ్యాహ్నం మరణించారు. ఆయన కుటుంబం టీడీపీ పట్ల అంకితభావంతో పని చేస్తూ, పంచాయతీలో బలోపేతానికి కృషి చేశారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు పెద్దలోచలి గ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయి.