మైదాన ప్రాంతంలో వాతావరణం ఏజెన్సీని తలపిస్తుంది. ఓ పక్క చలి మరోపక్క మంచుతో సోమవారం కోటవురట్లతో పాటు పరిసర ప్రాంతాల్లో వాతావరణం అహ్లాదకరంగా మారింది. చలి పెరగడంతో ప్రజలు చలిమంటలు వేసుకొని రక్షణ పొందుతున్నారు. ఈ ఏడాది వర్షాలు ఎక్కువ పడడం వల్ల మంచు కూడా దట్టంగా కురుస్తుంది. చలి గాలులు మరింత పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నట్లు వాతావరణం నిపుణులు తెలిపారు.