కోటవురట్ల మండలం పీ. కొత్తపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో భూ సమస్యలకు సంబంధించి 77 అర్జీలు వచ్చినట్లు తహశీల్దార్ తిరుమల బాబు తెలిపారు. వాటిపై విచారణ నిర్వహించి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ముఖ్యంగా భూవివాదాలు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిర్వహించే సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.