గత నెల రెండో తేదీన ఆంధ్ర యూనివర్సిటీ పురుషుల హాకీ సెలక్షన్స్ కై నక్కపల్లి హాకీ క్రీడా ప్రాంగణంలో ఏయు ఆధ్వర్యంలో జరిగిన ఎంపికలో నక్కపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన వారిలో ప్రగడ రోహిత్, కర్రీ భాస్కర్, యలమంచిలి ఎస్. జి. ఎ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి ఎ. నాగ వెంకట సాయిబాబు, పాయకరావుపేట స్పెసెస్ డిగ్రీ కళాశాల నుండి ఎ. నీరజ్ ఉన్నారని పీ. డీ కొటారు దుర్గారావు తెలిపారు.