అల్లూరి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను ఇప్పటివరకు అరెస్టు చేయనందుకు నిరసనగా లింగరాజుపాలెం అల్లూరి విగ్రహం వద్ద క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం. అప్పలరాజు మాట్లాడుతూ డిసెంబర్ 31న ఘటన జరగగా ఇంతవరకు దుండగులను అరెస్టు చేయకపోవడం పోలీసుల వైఫల్యంగా పేర్కొన్నారు.