ఎస్. రాయవరం మండలం ధర్మవరంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం. అప్పలరాజును పోలీసులు సోమవారం ఉదయం నుంచి గృహ నిర్బంధంలో ఉంచారు. నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి పనులు జరుగుతున్న నేపథ్యంలో వాటిని అడ్డుకుంటారని భావించి పోలీసులు ఈ చర్యలకు దిగినట్లు అప్పలరాజు ఆరోపించారు. నిర్వాసితులకు ఎటువంటి ప్యాకేజీ ఇవ్వకుండా పనులు ప్రారంభించడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు.