పెందుర్తి: తమను విధుల్లోకి తీసుకోవాలంటూ వాలంటీర్ల ఆందోళన

63చూసినవారు
తమను ఉద్యోగంలోకి తీసుకోవాలని, ఆరు నెలల జీతం బకాయిలు చెల్లించాలనికోరుతూ బుధవారం వాలంటీర్లు పెందుర్తి తాహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా రాస్తారోకో నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా తాహశీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. పెందుర్తి నియోజకవర్గ నలుమూలల నుంచి తరలిరాగా వారికి సిఐటియు మద్దతు ప్రకటించింది. ఎన్నికల ముందుఇచ్చిన వాగ్దానాన్ని ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్