నా గెలుపు కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలు అందరూ నావాళ్లేనని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. పెందుర్తి మండలం సుజాతనగర్ లో సోమవారం జనసేన శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ కార్యకర్తలు ఎటువంటి అపోహలు పడవద్దని అన్నారు. త్వరలో మండల గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. తాను నిరంతరం నాయకులు కార్యకర్తలకు అందుబాటులో ఉంటాను అన్నారు.