సబ్బవరం: మధ్యాహ్నం భోజనం పథకాన్ని ప్రారంభించిన హోం మంత్రి

83చూసినవారు
సబ్బవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో కలిసి శనివారం మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిర్ణయం మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నేటి నుంచి మధ్యాహ్న భోజనం అమలు జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్