ప్రతీ సోమవారం పోలీసు కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 58 ఫిర్యాదులు వచ్చాయని విశాఖ పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. బాధితుల నుంచి స్వయంగా ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం ఫిర్యాదులను సంబంధిత అధికారులకు రిఫర్ చేశారు. సకాలంలో సమస్యలు పరిష్కరించాలని సీపీ ఆదేశించారు.