రాష్ట్ర బీసీ సంఘం సెక్రెటరీగా విశాఖ వాసి

586చూసినవారు
రాష్ట్ర బీసీ సంఘం సెక్రెటరీగా విశాఖ వాసి
విజయవాడలో రాష్త్ర బిసి సంఘం అధ్యక్షలు డాక్టర్ మరేసు ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో విశాఖపట్నంకు చెందిన పోలవరపు నర్సింగ్ ను రాష్ట్ర బీసీ సంఘం సెక్రెటరీగా జాతీయ అధ్యక్షులు మరియు రాజ్యసభ సభ్యులు అయిన ఆర్ కృష్ణయ్య, రాష్ట్రా అధ్యక్షలు డాక్టర్ మరేసు నియమించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ, యువకుడైన పోలవరపు నర్సింగ్ ను నియమించడం గొప్ప విశేషం. గతంలో బీసీలు సంక్షేమం కొరకు పాటుపడ్డారని అన్నారు. కరోనా సమయంలో రోగులను గుర్తించి వారికి సరైన సమయంలో ఆసుపత్రికి పంపించి మంచి వైద్య సేవలు అందించే విధంగా కృషి చేశారన్నారు. మాస్కులు మరియు నిత్యాఅవసర వస్తువులను పంపిణీచేసారు ఏ పదవిని ఆశించకుండా సేవ చేయడం గొప్ప విశేషం అన్నారు. అటువంటి యువకుడుకి ఇటువంటి బాధ్యతాయుతమైన పదవిని ఇవ్వడం ద్వారా ఆ పదవికి వన్నె తెస్తారని భావిస్తున్నానన్నారు. బి సి. సంఘం ల అభివృద్ధి కొరకు కృషి చేయాలనీ అన్నారు కార్యక్రమంలో లో జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య. రాష్ట్రా బి. సి సంఘం కన్వినర్ పితాని ప్రసాద్. ఎం. ఎల్. సి. పోతుల సునీత, మత్స్యకారు చైర్మన్ కోలా గురువులు వివిద రాష్ట్ర కార్పొరేషన్ చైర్మనులు పాల్గొ న్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్