విశాఖ జీవీఎంసీ మంచినీటి సరఫరా విభాగం కార్మికులు సోమవారం ధర్నా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉదయం నుంచి కుళాయిలు బంద్ అయ్యాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గం తో పాటు పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా జరగలేదు. తమ డిమాండ్ల సాధన కోసం విశాఖలో మంచినీటి సరఫరా విభాగం కార్మికులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. తాగునీరు సరఫరా కాకపోవడంతో నగర ప్రజలు ఇబ్బందులు పడ్డారు.