24న విశాఖ మ్యూజియం ఉచిత సందర్శనకు అనుమతి

77చూసినవారు
24న విశాఖ మ్యూజియం ఉచిత సందర్శనకు అనుమతి
జీవీఎంసీ పరిధిలోగల విశాఖ మ్యూజియం సందర్శనకు ఈనెల 24న ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణమూర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వరల్డ్ హెరిటేజ్ వీక్ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. ఉదయం 10: 30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శించవచ్చునని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్