విశాఖ జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచంద్ర ఈనెల 18న విశాఖ వస్తున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్‌ను విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మంగళవారం విడుదల చేశారు. 18, 19 తేదీల్లో వివిధ కంపెనీల్లో జరిగే అధికారిక సమావేశాల్లో ఆయన పాల్గొంటారని పేర్కొన్నారు.