విషతుల భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసినట్లు విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదివారం తెలిపారు. ఇబ్బందులు ఉన్నవాళ్లు సైక్లోన్ కంట్రోల్ రూం 0891-2590102, 0891 2590100, పోలీస్ కంట్రోల్ రూమ్ 0891 2565454, 100 నంబర్లను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు.