మరో 12 గంటల్లో తీవ్ర వాయుగుండం

76చూసినవారు
ప్రస్తుతం వాయుగుండం వాయువ్య బంగాళాఖాతంలో నెమ్మదిగా ఉత్తర దిశగా కదులుతోందని విశాఖలోని వాతావరణ కేంద్రం ఆదివారం సాయం‍త్రం ప్రత్యేక బులెటెన్‌లో పేర్కొంది. ఇది కళింగపట్నంకు తూర్పు దిశగా 250 కి. మీ, గోపాల్‌పూర్‌కు తూర్పు-ఆగ్నేయంగా 230 కి. మీ, పారాదీప్ కు దక్షిణంగా 270 కి. మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర దిశగా ప్రయాణించి మరో 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం వుంది.

సంబంధిత పోస్ట్