కార్పొరేటర్ సురేష్ పై నమోదు చేసిన రౌడీ షీట్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ పశ్చిమ నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు మళ్ళ విజయ ప్రసాద్ ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద మంగళవారం ఆందోళన నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు, రాజకీయ దురుద్దేశంతో కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. వాటిని ఐక్యంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు.