గిరిజనులు నుంచి సేకరిస్తున్న కాఫీ కొనుగోలు ధరను 2024-25 సంవత్సరానికి నిర్ణయించేందుకు సోమవారం విశాఖలో అపెక్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. జీసీసీ ఎండీ కల్పనా కుమారి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ ఏడాది అరెబికా పార్చ్ మెంట్ కాఫీ (కిలో)రకానికి రూ. 285, అరెబికా చెర్రీ రకానికి రూ. 150, రోబస్టా చెర్రీ కాఫీ రకానికి రూ. 80 చొప్పున ధర నిర్ణయించామన్నారు.