కూలేందుకు సిద్ధంగా కొండవాలు ప్రాంతాల ఇళ్లు

82చూసినవారు
విశాఖలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ముఖ్యంగా కొండవాలు ప్రాంతాలు గజగజలాడుతున్నాయి. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని గోపాలపట్నం కొండవాలు ప్రాంతంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. భారీ కోతకు గురై అక్కడున్న భవనాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. అధికారులు తమను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్