విశాఖలోనే జగన్‌ సీఎంగా ప్రమాణస్వీకారం

81చూసినవారు
జూన్‌ 4న వైసీపీ ప్రభంజన సృష్టించబోతోందని, విశాఖలోనే వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం విమానంలో విశాఖకు చేరుకున్నారు. ఈసందర్భంగా ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడారు. జూన్‌ 9న జగన్‌ ప్రమాణస్వీకారం చేస్తారని, ఇందులో తిరుగులేదన్నారు. సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్నారు. ఒకే దెబ్బకు టీడీపీ, జనసేన గల్లంతు కావడం ఖాయమన్నారు.

సంబంధిత పోస్ట్