విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీ కరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాల జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గత 1350 రోజులుపైగా రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా మల్కాపురం సిఐటియు కార్యకర్తలు బుధవారం నిరాహార దీక్షలో కూర్చున్నారు. స్టీల్ ప్లాంట్ కు సొంతగనులు ఇవ్వాలని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అన్నారు.